Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై 1 నుంచి పోస్టాఫీసుల్లోని డిపాజిట్లపై పెరుగుతున్న వడ్డీ.. స్కీమ్స్ సంగతేంటి?

Advertiesment
Post Office
, సోమవారం, 20 జూన్ 2022 (10:01 IST)
పోస్టాఫీసుల్లో స్కీమ్ ప్రారంభించాలని అనుకుంటున్నారా.. అయితే ఈ పథకాల గురించి తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టు ఆఫీస్‌లో ఎన్నో స్కీమ్‌లు వున్నాయి. అందులో ఏ పథకాలకు ఎక్కువ వడ్డీ రేట్లు వస్తాయనేదాని గురించి తెలుసుకుందాం. 
 
వచ్చే నెల జూలై 1 నుంచి పోస్టాఫీసుల్లోని డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని పొందవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై జూన్ 30న నిర్ణయం తీసుకోనున్నారు. 
 
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రెపో రేటు, పెరుగుతున్న రుణ రేటు కారణంగా, చిన్న పొదుపు పథకం వడ్డీ కూడా బాగా పెరుగనుంది.
 
చిన్న పొదుపు పథకాలపై ఇప్పుడు లభిస్తున్న వడ్డీ వివరాల్లోకి వెళ్తే.. జాతీయ పొదుపు రికరింగ్ డిపాజిట్ ఖాతా 5.8%, జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా 6.6%, కిసాన్ వికాస్ పత్ర 6.9%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఫండ్ 7.1%, జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం 6.8% , సుకన్య సమృద్ధి పథకం కింద 7.6%, సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద 7.4% గా ఉన్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
 
అయితే ఆర్‌బీఐ రెపో రేటు పెంచినప్పటి నుంచి బ్యాంకులు రుణాలను మరింతగా పెంచుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ కూడా పెరిగింది. కానీ..PPF,సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, NSC వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది.  
 
ఇటీవల కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ మరియు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. చిన్న మొత్తాల పొదుపు పథకంపై కూడా వడ్డీ ఎక్కువగా ఉంటుందనడానికి ఇది సంకేతం.  
 
అందులో ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ స్కీంలో ప్రస్తుం 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటును వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. 
 
దీనిలో కనీసం నెలకు రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. కానీ ఈ ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీదనే తెరవాల్సి ఉంటుంది.  
 
ఈ ఖాతాను దేశంలో ఏ పోస్టు ఆఫీస్ నుంచి అయినా ఓపెన్ చేయవచ్చు. దీనిలో ఖాతా తెరిచిన దగ్గర నుంచి ఆ ఖాతాదారునికి 21 సంవత్సరాలు వచ్చే వరకు వడ్డీ జమ అవుతూ ఉంటుంది.
 
21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. అయితే దీనిలో ఉన్నత విద్య కోసం ఖాతాదారు ఆర్థిక అవసరాలను తీర్చడానికి, మునుపటి ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతా క్రెడిట్‌లో ఉన్న బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించబడుతుంది.
 
అయితే, ఖాతాదారుడికి 18 ఏళ్లు నిండినప్పుడు లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినప్పుడు, ఏది ముందైతే అది మాత్రమే ఉపసంహరణకు అనుమతించబడుతుంది. 
 
దీని కోసం కేవలం రాతపూర్వక దరఖాస్తు మాత్రమే కాదు.. విద్యా సంస్థలో ధృవీకరించబడిన ప్రవేశ ఆఫర్ రూపంలో డాక్యుమెంటరీ రుజువు లేదా అటువంటి ఆర్థిక అవసరాన్ని స్పష్టం చేస్తూ సంస్థ నుండి ఫీజు స్లిప్ అవసరం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు - జారీ కానీ హాల్‌టిక్కెట్లు