Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-06-2022 ఆదివారం రాశిఫలాలు ... సూర్య నారాయణ పారాయణ చేసినా...

Advertiesment
tula rashi
, ఆదివారం, 19 జూన్ 2022 (04:00 IST)
మేషం :- కొబ్బరి, పండ్లు, పూలు, చల్లనిపానియ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీశ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా మెలగాలి.
 
వృషభం :- బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శుభకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఒక స్థిరాస్తి తాకట్టుతో మీ అవసరాలు నెరవేరగలవు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త కొత్త వ్యాపార రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు విదేశీ చదువుల విషయంలో అడ్డంకులు తొలగిపోగలవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
సింహం :- మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళన తప్పదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. వ్యాపారాల్లో అనుభవం, ఆశించినలాభాలు గడిస్తారు.
 
తుల :- మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
వృశ్చికం :- పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానియ వ్యాపారులకు లాభదాయకం. మీ వాహనం ఇతరుల కిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధ పెట్టకండి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
ధనస్సు :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కుదుట పడుతుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మీ ధైర్య సాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలలో మీదే పైచేయిగా ఉంటుంది. మీ శ్రీమతి, సంతానం గొంతమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏజన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం.
 
కుంభం :- ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు.
 
మీనం :- ఏ.సి. కూలర్ మోకానిక్ రంగాలలో వారిక సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు లభించిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఎక్కడో పొరపాటు చోటుచేసుకుంటుంది. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-06-2022 నుంచి 25-06-2022 వరకు మీ వార రాశిఫలాలు