Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-06-2022 బుధవారం రాశిఫలాలు ... గాయిత్రి మాతను ఆరాధించిన శుభం..

Advertiesment
Karkatam
, బుధవారం, 15 జూన్ 2022 (04:00 IST)
మేషం :- బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరదు. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు.
 
వృషభం :- మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అందరి యందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
మిథునం :- ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. స్త్రీలు పట్టుదలతో సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణంగా పరిశీలించండి.
 
కర్కాటకం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి విషయం మీ జీవితభాగస్వామికి తెలియజేయటం మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. సమయస్పూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు.
 
సింహం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి. అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యలను పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది.
 
కన్య :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు అనునవైన పరిస్థితులు నెలకొంటాయి.వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి ఆర్ధిక సంస్థల నుంచి ఋణం మంజూరవుతుంది. ముక్కుసూటిగా పోయే మీ తీరున విమర్శలకు దారితీస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది.
 
వృశ్చికం :- విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిది కాదు. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులెదుర్కుంటారు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి.
 
ధనస్సు :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు యాదృచ్చికంగానే దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార వర్గాల వారికి ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.
 
మకరం :- వ్యాపార వర్గాల వారికి అధికారుల తనిఖీలు, షాపు గుమస్తాల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. రెండవ విడత కౌన్సెలింగ్‌లో కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీపై శకునాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
 
కుంభం :- మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై దృష్టి సారించాలి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. తేలికగా పూర్తయ్యే పనుల కోసం అధికంగా శ్రమించవద్దు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
మీనం :- కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీదేవితో పాటు గుడ్లగూబ నిలబడి ఉన్న ఫోటోను పూజగదిలో పెట్టవచ్చా?