Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-06-2022 ఆదివారం రాశిఫలాలు ... ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం...

Advertiesment
Mesha Raashi
, ఆదివారం, 12 జూన్ 2022 (04:00 IST)
మేషం :- స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మధ్యవర్తులు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృషభం :- వార్తాసంస్థలలోని సిబ్బందికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించటం మంచిది.
 
మిథునం :- ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహనలేక చికాకులు వంటివి ఎదుర్కుంటారు. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, సముచిత హోదా, కోరుకున్నచోటికి బదిలీ వంటి శుభఫలితాలున్నాయి. కల్యాణ మండపాల కోసం అన్వేషిస్తారు.
 
కర్కాటకం :- రావలసిన బకాయిలు వాయిదా పడుట వలన ఆందోళనకు గురవుతారు. కొన్ని విషయాల్లో మిత్రులు మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు. చిన్న చిన్న విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
సింహం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కన్య :- ఆర్థిక సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారంతో సమసిపోగలవు. ప్రేమికుల మధ్య అవగాహన లోపం, అపార్థాలు చోటుచేసుకుంటాయి. మీ చుట్టు ప్రక్కల వారు మీ సహాయం అర్థిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు.
 
తుల :- విద్యుత్, ఏ.సి.కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసికాందోళన తప్పదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో మెళుకువ అవసరం.
 
వృశ్చికం :- ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. మెడికల్, ఇంజనీరింగ్ టెక్నికల్ విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు.
 
ధనస్సు :- ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. విద్యుత్, ఎ.సి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మకరం :- ఆదాయ వ్యాయాలు సమానంగా ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మిత్రులను అధికంగా నమ్మడం వల్ల నష్టపోతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
కుంభం :- కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు.
 
మీనం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల ఆరోగ్యము కుదుటపడుతుంది. విద్యారంగంలోని వారికి నూతన ఉత్సాహం, పురోభివృద్ధి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-06-2022 నుంచి 18-06-2022 మీ వార రాశిఫలాలు