Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-06-2022 గురువారం రాశిఫలాలు ... రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...

Advertiesment
simha raasi
, గురువారం, 16 జూన్ 2022 (04:00 IST)
మేషం :- సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
వృషభం :- స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అధ్యాపకులకు పురోభివృద్ధి, విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు.
 
మిథునం :- ఆర్థికపరమైన చర్చలు, కీలకమైన నిర్ణయాలకు ఇది అనుకూలం. గృహంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేపడతారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఆలయాలను సందర్శిస్తారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. శస్త్రచికిత్సచేయునపుడు వైద్యులకు ఏకాగ్రత అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు.
 
సింహం :- రావలసిన ధనం సమయానికి అందక పోవటంతో ఇబ్బందులు తప్పవు. విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించడంతో మానసికంగా కుదుటపడతారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఇతరులకు ధనం ఇచ్చినా తిరిగిరాజాలదు.
 
కన్య :- ఓర్పు, పట్టుదలతో అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సమావేశాలలో పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. బంధుమిత్రుల నుండి అపవాదులు, అపనిందలు వంటివి ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రుణబాధలు పెరుగుతాయి.
 
తుల :- విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఖర్చులు మీ రాబడికి మించటం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు.
 
వృశ్చికం :- ఆర్థికంగా బాగుగా పురోభివృద్ధి చెందుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం. రవాణా రంగాలవారికి ఇబ్బందులు తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
ధనస్సు :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వస్త్ర, వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మనోధైర్యంతో ఎంతటి కార్యానైనా సాధించ గలుగుతారు. ఉద్యోగులకు మార్పులు తధ్యం.
 
మకరం :- గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. స్త్రీల యత్నాలకు అయిన వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఎరువులు, విత్తనాల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. సోదరీ సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
 
కుంభం :- భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మొక్కుబడులు, దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
మీనం :- మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. స్త్రీలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. కొత్త దంపతులకు పలు ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తు శాస్త్రం: మనీ ప్లాంట్‌తో ఆ మొక్కను కూడా పెంచాలట...