తెలుగు సినీరంగంలో వింత పోకడ ఎప్పటినుంచో వుంది. ప్రతిసారీ కార్మికులు సమ్మె చేస్తూ షూటింగ్‌లు ఆపివేయాలని తీర్మానం చేసుకుంటారు. తమకు సరైన వేతనాలు, న్యాయం చేయాలని కోరుతూ గత కొద్దిరోజులుగా సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు పెద్ద దిక్కు అయిన కార్మిక సమాఖ్యకు విన్నవించారు. వారు ఫెడరేషన్ అధ్యక్షులకు తెలియజేశారు. స్పందించకపోవడంతో ఈరోజు బుధవారంనాడు ఇందిరానగర్‌లోని ఫెడరేషన్ కార్యాలయానికి కార్మికులంతా చేరుకున్నారు.
- కార్మికులను సినిమా షూటింగ్‌లకు తీసుకెళ్ళేందుకు వ్యాన్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిని సమాఖ్య నాయకులు ఈరోజు పంపలేదు. దాంతో షూటింగ్‌కు జనాలు లేక ఆగిపోయాయి. అయితే ఆ ప్రభావం చిన్న సినిమాలు, టీవీ సీరియర్లపైనే పడింది. కానీ పెద్ద సినిమాల షూటింగ్ యథావిధిగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కార్మిక అధ్యక్షుడు దొరౌ తెలియజేస్తూ, ఇలా జరగడం మామూలే అని, పెద్ద సినిమాలకు షూటింగ్ అంటే కాల్‌షీట్లసు, లొకేషన్లు, ఇతరత్రా కోట్లలో వుంటుంది. దానివల్ల నిర్మాకు నష్టం జరుగుతుందని అనవడం విశేషం. అయితే మేం సమ్మె చేస్తున్నట్లు ఆ నిర్మాతలకు తెలుసని కార్మికులు అంటున్నారు.