Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైసెన్స్ లేని యువతికి బైకిచ్చి జైలుపాలైన హైదరాబాద్ వాసి!

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (09:07 IST)
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లైసెన్స్‌ లేని యువతికి వాహనం ఇచ్చిన వ్యక్తిని జైలుకు పంపించారు. 
 
ఈనెల 20న రేష్మ (20) స్నేహితులతో కలిసి మియాపూర్‌లో ఓ థియేటర్‌లో సినిమా చూశారు. తిరిగొచ్చే క్రమంలో స్నేహితుల్లో ఒకరైన అజయ్‌సింగ్‌ నడుపుతున్న స్కూటీపై ఆమె వెనుక కూర్చొంది. రాత్రి 11.40 గంటల సమయంలో మార్గమధ్యలో జలమండలి కార్యాలయం వరకు రాగానే తాను బండి నడుపుతానని వాహనం తీసుకుంది. 
 
కొంతదూరం నడిపిన అనంతరం వాహనం అదుపు తప్పి హైదర్‌నగర్‌ వద్ద ఇసుక లారీ చక్రాల కింద పడిపోవడంతో ఆమె చనిపోయింది. రేష్మకు బండి నడపడం రాదు. లైసెన్స్‌ కూడా లేదు. ఈ విషయం తెలిసీ, వాహనం ఇచ్చిన అజయ్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ కృష్ణ పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments