Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ కేసులో వీడని మిస్టరీ.. పరీక్షల్లో కనిపించని క్లోరోఫాం ఆనవాళ్లు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (09:38 IST)
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన అక్కా చెల్లెళ్ల అత్యాచారం కేసులోని మిస్టరీ ఇంకా వీడిపోలేదు. ఈ కేసులోని సరైన క్లూ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాధితులిద్దరికీ జరిపిన పరీక్షల్లో క్లోరోఫాం ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో దర్యాప్తు బృందాలు తలలు పట్టుకుంటున్నారు.
 
కాగా, ఇటీవల ఈ గాంధీ ఆసుపత్రిలో తనతో పాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై స్పష్టత సాధించడంతో పాటు ఇప్పటికీ ఆచూకీ లేని మరో బాధితురాలిని కనిపెట్టడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 
 
అయితే బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన లొల్లిగానూ అనుమానిస్తున్న అధికారులు..ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడం, అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments