Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో స్థానానికి పడిపోయిన హైదరాబాద్ మెట్రో రైల్ .. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (08:23 IST)
తెలుగు రాష్ట్రాల్లో మెట్రో రైల్ సౌలభ్యం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉంది. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో మార్గం ఉండగా, ఈ మార్గంలో మొత్తం 57 మెట్రో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ హైదరాబాద్ మెట్రో మెట్రో మూడో స్థానానికి పడిపోయింది. 
 
దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం మెట్రో రైల్ నెట్‌వర్క్ కలిగిన నగరాల్లో ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో రైల్ రెండో స్థానంలో ఉండగా, ఇపుడది మూడో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం.. మెట్రో రైల్ విస్తరణపై సంవత్సరాల తరబడి ప్రకటనలు చేస్తున్నారేగానీ క్షేత్ర స్థాయిలో విస్తరణకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఇతర మెట్రో నగరాల్లో మెట్రో రైల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి విస్తరణ పనులను శరవేగంగా చేస్తున్నారు. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.  
 
బెంగుళూరు నగరంలో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా 13.71 కిలోమీటర్ల దూరానికి నిర్మించిన మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. దీంతో బెంగుళూరు నమ్మ మెట్రో నెట్‌వర్క్ 70 కిలోమీటర్లకు చేరింది. ఫలితంగా హైదరాబాద్ మెట్రో 69.2 కిలోమీటర్లతో మూడోస్థానానికి దిగజారింది. 348 కిలోమీటర్ల పొడవుతో ఢిల్లీ మెట్రో రైల్ మార్గం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ రోజుకు 42 లక్షల మంది ప్రజలు మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 255 మెట్రో రైల్ స్టేషన్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ నుంచి ఓనమ్.. సాంగ్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments