Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు.. నీ కడుపులోని బిడ్డ చచ్చిపోండి... యువతికి ప్రియుడి వార్నింగ్

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (12:57 IST)
పెళ్లికి ముందే తొందరపడిన ఓ యువతి.. ప్రియుడు చేతిలో మోసపోయింది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసిన ప్రియుడు.. చివరకు ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా.. కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు పాటు నువ్వుకూడా చనిపోవాలంటూ బెదిరించాడు. దీంతో దిక్కుతోచని ఆ యువతి.. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
 
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని వికారాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్‌కు చెందిన కర్రె అనూష (22) 2017 సంవత్సరంలో ఒవైసీ నర్సింగ్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ 3వ సంవత్సరం చదువుతోంది. 
 
ఆ సమయంలో హస్తినాపురంకు చెందిన విజయ్‌కుమార్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి, పెళ్ళికి ముందే శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చడంతో విజయ్‌కుమార్‌ పెళ్లి చేసుకోకపోగా ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
 
తాజాగా ఓ దొంగతనం కేసులో అనూష జైలుకు వెళ్లడంతో అప్పటి నుంచి విజయ్‌కుమార్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి కనిపించకుండా పోయాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అనూష వెంటనే విజయ్‌కుమార్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా నువ్వు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చచ్చిపోండని బెదిరించారు. 
 
విజయ్‌కుమార్‌ స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించన అనూష న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments