Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. డిపాజిట్ చేస్తేనే ఆదాయం.. ఐదు లక్షలు గోవిందా!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (12:43 IST)
సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అబిడ్స్‌కు చెందిన యువతి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మి.. లక్షలు మోసపోయింది. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రోజుకు వెయ్యి సంపాదించవచ్చునని ఆశచూపి.. రెండు వేల రూపాయలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, నెల తర్వాత రూ.28వేల ఆదాయం చూపించారు. ఆ సొమ్ము విత్ డ్రా చేసుకునేందుకు అదనంగా 50వేల రూపాయలను డిపాజిట్ చేయాలన్నారు. 
 
సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్ పెంచారు. ఇలా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకుని ఖాతా రద్దు చేశారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హైదరాబాదు నగరంలో చాలామంది ఇలా మోసపోయారు. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు వున్నారు. 
 
ఆన్ లైన్ వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు సులభంగా ఈ ఉచ్చులో పడుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు ఇలాంటి ప్రకటనలు వస్తే నమ్మొద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా పెట్టుబడి పెట్టవద్దని.. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments