బతకాలని వుంది.. కానీ మీకు బారమవుతున్నా.. అందుకే వెళ్లిపోతున్నా...

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:05 IST)
తెలంగాణాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ వృద్ధులు తన కుటుంబ సభ్యులకు భారంకారాదని భావించి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెక్కల కష్టంతో మిమ్మల్ని పెంచి పెద్ద చేసినందుకు ఇంతకాలం కష్టాలు లేకుండా చూశారు. ఇంకా నాకు బతకాలనే ఉంది. కానీ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. నాకు సపర్యలు చేయడం కోసం మీరు ఇబ్బంది పడొద్ధు అందుకే మీకు కనిపించనంత దూరం వెళ్లిపోతున్నా.. నా కడుపున పుట్టిన మీరు.. నన్ను క్షమించండి నాన్నా అంటూ.. పండగ వేళ ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ విషాదకర ఘటన తెలంగాణాలోని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన వెల్దండి లక్ష్మి (85)కి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. అందరి వివాహాలు అయ్యాయి. 30 ఏళ్ల క్రితమే లక్ష్మి భర్త ఉప్పలయ్య మృతి చెందాడు. 
 
పెద్ద కుమారుడు వెల్దండి గోపాల్‌ గ్రామంలో ఉంటుండగా చిన్న కుమారుడు వెంకటేష్‌ పరకాల మండలం పులిగిల్లలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మి ఇద్దరు కుమారుల వద్ద ఒక్కో నెల ఉంటూ వస్తోంది. ప్రస్తుతం గోపాల్‌ ఇంటివద్ద ఉండగా మళ్లీ అనారోగ్యం బారిన పడింది. 
 
దీంతో మనస్తాపానికిగురై ఎవరికీ భారం కావద్దనుకొని గ్రామంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ రాజాబాబు తెలిపారు. గోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments