మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ కన్నుమూత

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:20 IST)
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్ను ముశారు. నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గానికి 1994 నుంచి 1999 వరకు శాసనసభ్యునిగా సేవలు అందించారు.

నాగార్జున సాగర్ (చలకుర్తి) మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి మృతి చెందారు. 1994-99 మధ్య చలకుర్తి తెదేపా ఎమ్మెల్యేగా రామ్మూర్తి యాదవ్ పని చేశారు.

అంత్యక్రియలు త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీవిత ప్రస్థానం 1947 అక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1981లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్​గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

ఎన్టీఆర్​కు అత్యంత సన్నిహితులు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకునిగా ఉన్న కేసీఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరికి అజాత శత్రువుగా పేరు సంపాందించారు. ఆయన మృతికి ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Naveen Polisetty: సంక్రాంతికి నవీన్‌ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల

Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ

ShivaRaj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు అందుకే సంతోషంగా బతకాలి : శివ రాజ్ కుమార్

ఉరికంబం ఎక్కిన ఖుదీరాం బోస్ గా చేయడం అదృష్టం - రాకేష్ జాగర్లమూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?

ఆరోగ్యకరమైన ట్విస్ట్‌తో పండుగ వేడుకలను జరుపుకోండి: డార్క్ చాక్లెట్ బాదం ఆరెంజ్ కేక్

తర్వాతి కథనం
Show comments