మూగబోయన ప్రజాగళం... : ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (15:40 IST)
ప్రజా గాయకుడు గద్దర్‌ ఇకలేరు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇండో అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని ఓ హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. 
 
ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. ఆయా సమయాల్లో ఆయన చురుకైన పాత్రను పోషించారు. గద్దర్‌ 1949లో తూఫ్రాన్‌లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 
 
1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్‌. నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు అందుకున్నారు. అయితే, నంది అవార్డును తిరస్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MM keeravani: వందేమాతరం నా జీవితలో మైల్ రాయి : కీరవాణి

సంకల్ప యాత్ర వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు : బండ్ల గణేశ్‌

రాంచరణ్ సినిమా కాకుండా.. అరుంధతి లాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Samantha: సమంత క్లాప్ తో చీన్ టపాక్‌ డుం డుం ఘనంగా ప్రారంభం

మగాళ్లు రేప్ చేస్తున్నారు.. వారందర్నీ పట్టుకుని చంపేద్దామా? రేణూ దేశాయ్ ప్రశ్న (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments