Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శీతలపానీయంలో మద్యం కలిపి.. వివాహితకు తాగించి లైంగికదాడి.. ఎక్కడ?

suicide
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:52 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. శీతలపానీయంలో మద్యం కలిపి వివాహితకు తాగించి, ఆ తర్వాత లైంగికాదిడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడసాగాడు. ఈ ఘటన మధురా నగర్ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన బాధితురాలికి ఆన్‌లైన్ గేమింగింలో ఏపీకి చెందిన జాషువా, సాయి కుమార్, నర్సింహమూర్తి అనే వారు పరిచయమయ్యారు. ఈ క్రమంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న జాషువాను ఆమె 2020 జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకుంది. ఇది నచ్చని నర్సింహమూర్తి ఆమె వెంటపడటం ప్రారంభించాడు. ప్రేమిస్తున్నానని ఫోనులో సందేశాలు పంపసాగాడు. 
 
తరచూ ఫోన్ చేస్తుండటంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో బాధితురాలు ఉద్యోగం చేస్తానని నగరానికి వచ్చి బల్కంపేటలో తన స్నేహితురాలి ఫ్లాట్‌కు వచ్చింది. ఇది తెలిసిన నర్సింహమూర్తి ఆమె దగ్గరకు వచ్చాడు. భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి అమీర్‌పేటలోని ఓ వసతిగృహంలో చేర్పించాడు. 
 
అంతేకాకుండా రహ్మత్ నగర్ పరిధి జవహర్ నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. బాధితురాలిని అక్కడికి పిలిపించి శీతలపానీయంలో మద్యం కలిపి ఆమెతో తాగించాడు. అత్యాచారానికి పాల్పడటమేకాకుండా వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం బెదిరింపులు ప్రారంభించాడు. దీంతో స్వగ్రామానికి వెళ్లిన బాధితురాలు గతనెల 7న అక్కడ ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కదులుతున్న రైలు నుంచి పడిన ప్రేమికులు.. మాట్లాడుతూ..?