Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ విద్యను కోరుకుంటున్న ఔత్సాహిక విద్యార్థుల కోసం ఐడిపి ఎడ్యుకేషన్ ఫెయిర్

Advertiesment
students
, శనివారం, 5 ఆగస్టు 2023 (11:40 IST)
అంతర్జాతీయ విద్యా సేవల్లో అగ్రగామిగా ఉన్న ఐడిపి ఎడ్యుకేషన్, విదేశాల్లో చదవాలనే ఔత్సాహికులకు సహాయం చేయడానికి తమ అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఆగస్టు 5, 2023న పార్క్ హయత్‌లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించబడుతుంది, ఇందులో ఆస్ట్రేలియా- కెనడా నుండి దాదాపు 50 ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు పాల్గొంటాయి.
 
IDP ఎడ్యుకేషన్ సెప్టెంబరు 10, 2023న ITC కోహెనూర్‌లో 10:30 AM నుండి 4:30 PM వరకు అదనపు ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను కూడా నిర్వహించనుంది. యుకె, యుఎస్ఏ నుండి ప్రతిష్టాత్మక సంస్థల నుండి ప్రతినిధులను కలిసే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తుంది. ఐడిపి ఎడ్యుకేషన్‌ - దక్షిణాసియా మరియు మారిషస్ రీజినల్ డైరెక్టర్ పీయూష్ కుమార్ మాట్లాడుతూ, "విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో, హైదరాబాద్‌లోని ఫెయిర్ డైనమిక్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తోంది.  ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండి ప్రతినిధులు ఇక్కడకు వస్తున్నారు.." అని అన్నారు  
 
విశ్వవిద్యాలయ నిపుణులను కలిసే అవకాశంతో పాటు, ఈ ఫెయిర్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, పోస్ట్-స్టడీ వర్క్ అవకాశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మరియు వివిధ సంస్థలకు దరఖాస్తు ప్రక్రియపై తక్షణ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఉచితం గా ఈ ఫెయిర్‌లో హాజరు కావడం తో పాటుగా ప్రతినిధులను కలవవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో రెడ్‌మి 12 సిరీస్ సేల్స్ అదుర్స్...