Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌ కిరాక్‌ హ్యాట్రిక్‌: లూథియాన లయన్స్‌పై ఘన విజయం

Advertiesment
hyderabad Kirrack
, శనివారం, 5 ఆగస్టు 2023 (12:25 IST)
కిరాక్‌ హైదరాబాద్‌ ఖతర్నాక్‌ విజయం సాధించింది. ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌)లో తొలి సీజన్లో కిరాక్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయంతో అదరగొట్టింది. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో లూధియాన లయన్స్‌పై 18-10తో ఏకపక్ష విజయం సాధించింది. అండర్‌ కార్డ్‌, మెయిన్‌ కార్డ్‌లో ఆధిపత్యం చూపించిన కిరాక్‌ హైదరాబాద్‌ లీగ్‌లో నాల్గో విజయం నమోదు చేసింది. లీగ్‌లో తన తర్వాతి మ్యాచ్‌ను కిరాక్‌ హైదరాబాద్‌ ఆగస్టు 7న (సోమవారం) బరోడా బాద్‌షాస్‌తో ఆడనుంది. ప్రొ పంజా లీగ్‌లో నాలుగో విజయం సాధించిన కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమాని నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. 
 
అండర్‌ కార్డ్‌లో క్లీన్‌స్వీప్‌ : 
లూథియాన లయన్స్‌తో అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు క్లీన్‌స్వీప్‌ చేశారు. మూడు మ్యాచుల్లోనూ 1-0తో విజయాలు సాధించి హైదరాబాద్‌కు 3-0 ఆధిక్యం కట్టబెట్టారు. స్పెషల్‌ కేటగిరీ మ్యాచ్లో భుట్టా సింగ్‌, మహిళల 65 కేజీల విభాగంలో కెఎన్‌ మధుర, 60 కేజీల విభాగంలో షోయబ్ అక్తర్‌లు సత్తా చాటారు. 
webdunia
మెయిన్‌ కార్డ్‌లోనూ: 
మెయిన్‌ కార్డ్‌ మ్యాచుల్లోనూ కిరాక్‌ హైదరాబాద్‌ జోరు కొనసాగింది. మెన్స్‌ 70 కేజీల విభాగంలో సత్నాం సింగ్‌ 0-10తో తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. దీంతో కిరాక్‌ హైదరాబాద్‌ 3-10తో వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లు తమ సత్తా చూపించారు. మహిళల 65 కేజీల విభాగంలో కెఎన్‌ మధుర వరుసగా రెండో మ్యాచ్‌లో డబుల్‌ ధమాకా అందించింది. అండర్‌ కార్డ్‌లో మెరిసిన మదుర.. మెయిన్‌ కార్డ్‌లోనూ అపర్ణ రోషిత్‌పై 10-0తో విజృంభించింది. దీంతో కిరాక్‌ హైదరాబాద్‌ 13-10తో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో జగదీశ్‌ బారు (మెన్స్‌ 100 కేజీల విభాగం) అదరగొట్టాడు. సచిన్‌ బడోరియపై 5-0తో విజయం సాధించి.. కిరాక్‌ హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్టెడ్ ఫ్లైట్‌లో విరాట్ కోహ్లీ జర్నీ.. ఫైర్ అవుతున్న నెటిజన్లు