Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింబుల్డెన్ టోర్నీలో సంచలనం : ఇంటి ముఖం పట్టిన ఇగా స్వైటెక్

Advertiesment
elina svitolina
, బుధవారం, 12 జులై 2023 (09:41 IST)
వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఉక్రెయిన్‌ దేశానికి చెందిన వరల్డ్ 76వ ర్యాంక్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా 7-5, 6-7, 6-2తో స్వైటెక్‌ను ఇంటిదారి పట్టించింది. 
 
ఎలాంటి అంచనాల్లేకుండా బరిలో దిగిన స్విటోలినా అనూహ్య విజయంతో సెమీస్ చేరింది. తొలి సెట్‌ను స్విటోలినా చేజిక్కించుకోగా, రెండో సెట్‌లో ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ బయటపడిన స్వైటెక్, ఆ సెట్‌ను టైబ్రేకర్‌లో గెలుచుకుంది. 
 
అయితే మూడో సెట్‌లో అదే ఊపు కనబర్చడంలో విఫలమైన స్వైటెక్ ప్రత్యర్థికి తేలిగ్గా తలవంచింది. చివరి సెట్‌లో స్విటోలినా పలుమార్లు స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేయడమే అందుకు నిదర్శనం. కాగా, సెమీస్‌లో స్విటోలినా... చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మార్కెటా వోండ్రొసోవాతో తలపడనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ వరల్డ్ కప్ 2023 : ఈడెన్ గార్డెన్స్‌ మ్యాచ్‌లకు టికెట్ ధరలు ఇవే...