Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట మునిగిన కలెక్టరేట్ : నెల రోజులు కాకముందే శ్లాబుల నుంచి లీకేజీలు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (10:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడిన నూతన కలెక్టర్ కార్యాలయం నీట చిక్కుకుంది. కలెక్టరేట్ చూట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. దీంతో కలెక్టరేట్ ఏదో వాగులో వున్నట్లు దర్శనమిస్తోంది. 
 
చుట్టూ వరద నీరు చేరడంతో కలెక్టరేట్ అధికారులతో పాటు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా చేరిన వర్షపునీటితో కలెక్టర్ కార్యాలయం ముందున్న గార్డెన్‌లో మొక్కలు పాడయ్యాయి. ఇక వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించే కార్యాలయ సెల్లార్‌లోకి కూడా నీరు చేరడంతో పార్కింగ్‌కు వీలు కాకుండా మారింది.
 
కలెక్టరేట్ ఆవరణమేకాదు భవన నిర్మాణంలోని డొల్లతనం కూడా ఈ వర్షాలతో బయటపడింది. భవనంలోపల అక్కడక్కడ లీకేజీలు కూడా దర్శనమిస్తున్నాయి. మూడో ఫ్లోర్ పైపులను అమర్చిన ప్రాంతంలోంచి నీరు లీకై భవనంలోకి చేరుకుంటోంది. ఇలాంటి లీకేజీలు కలెక్టరేట్ భవనంలో చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments