ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకునివున్నాయి. అయితే ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ముఖ్యంగా, నేడు, రేపు విస్తారంగా వానలు కురవనున్నాయి. కోస్తాలో నేడు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. 
 
									
										
								
																	
	 
	మరోవైపు, బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉన్నట్టు వివరించింది. దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.
 
									
											
									
			        							
								
																	
		ఇదిలావుంటే, రాగల రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
									
			                     
							
							
			        							
								
																	
		 
		తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలపడిందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. 
 
									
			                     
							
							
			        							
								
																	
		 
		వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.