Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్: ఖమ్మంలో యువతికి పాజిటివ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డులో సీఆర్‌జీ టవర్స్‌లో ఉంటున్న ఫ్యామిలీకి చెందిన 21ఏళ్ల యువతికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన యువతి హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని ఓ కాలేజీలో చదువుకుంటోంది. కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. 
 
ఈ నెల 19వ తేదీన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కరోనా టెస్టుకు శాంపిల్ ఇచ్చింది. అయితే ఆమెలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆ శాంపిల్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్య నిపుణులు ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. 
 
దీంతో అప్రమత్తమైన ఖమ్మం అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద యువతి కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారి శాంపిళ్లను కూడా ల్యాబ్‌కు పంపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments