కన్న కొడుకుని సిమెంట్ బిళ్లతో తల పగులగొట్టి హత్య చేసిన తండ్రి

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:47 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగుబండ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి, కొడుకుని కొట్టి చంపిన సంఘటన కలకలం రేపింది. గంగుబండ తండాకు చెందిన వడిత్య రవి (29) మద్యానికి బానిసై ప్రతిరోజు తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. రోజు లాగానే ఈరోజు కూడా మద్యం మత్తులో ఉన్న రవి, తండ్రి మల్సూర్‌తో గొడవ పడటంతో తండ్రి మల్సూర్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు.
 
కొడుకుతో విసిగిపోయిన తండ్రి సిమెంట్ బిళ్ళతో రవి తలపై గట్టిగా మోదడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రవికి భార్య ఉంది. మద్యానికి బానిసైన రవి నుంచి భార్య ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసైన రవి తండ్రితో రోజూ గొడవ పడుతూ ఉండేవాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: సూర్య, త్రిష జంటగా నటించిన వీరభద్రుడు సెన్సార్ పూర్తి

RB Choudhary : సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత, నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

ఐదు రోజుల్లో రూ. 5 కోట్ల గ్రాస్ దాటిన కలెక్ష‌న్స్ సాధించిన ధ‌నుష్ కర

Pooja Hegde: దళపతి విజయ్ గెలుపు ముందుగానే చెప్పిన పూజా హెగ్డే

NTR: ​విజయ్ గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పోల్చిన నందమూరి రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

తర్వాతి కథనం
Show comments