Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొల్యూషన్ ఫ్రీ వెహికల్... హైదరాబాద్ నగర రోడ్లపై ఈ-రిక్షాలు

పొల్యూషన్ ఫ్రీ వెహికల్... హైదరాబాద్ నగర రోడ్లపై ఈ-రిక్షాలు

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (11:51 IST)
పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభిన్నంగా ఆలోచన చేయనుంది. ఇందులోభాగంగా, హైదరాబాద్ నగర రోడ్లపైకి ఈ-రిక్షాలను ప్రవేశపెట్టనుంది. ఈ–రిక్షాలకు అధీకృత డీలర్లుగా ఆరు సంస్థలకు రవాణా శాఖ అనుమతిచ్చింది. వీటిలో రెండు స్థానిక సంస్థలు కాగా, మిగతావి వేరే ప్రాంతాలకు చెందినవి. 
 
పటాన్‌‌చెరులో ఓ కంపెనీ త్వరలో వీటి తయారీ ప్రారంభించనుంది. ఈ-రిక్షా ధర దాదాపు రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి బ్యాటరీ చార్జి చేస్తే 70-90 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. పర్మిట్‌తో సంబంధం లేకుండా రోడ్లపైకి రానున్నాయి. కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించింది. ఈ-రిక్షా నడిపేవారు ప్రత్యేక లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. డీలర్లు నిర్వహించే పది రోజుల డ్రైవింగ్‌ శిక్షణ తరగతులకు హాజరైన వారికే ఈ లైసెన్స్‌ జారీ చేస్తారు. ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ దాఖలు చేయాలనే నిబంధన అమలులో ఉంటుంది.
 
అయితే, ఈ-రిక్షాలను నడిపేందుకు అనుభవం ఉన్నవారికే అనుమతి ఇవ్వనున్నారు. 20 ఏళ్ల వయసు నిండిన వారికే ఈ వాహనాన్ని నడిపే అనుమతి ఇస్తారు. ఈ-రిక్షా నడపాలంటే కనీసం ఎనిమిదో తరగతి వరకు చదివి ఉండాలన్న నిబంధన కూడా విధించారు. ఆటో, లైట్‌ వెయిట్‌ మోటార్‌ వాహనాల లైసెన్స్‌ ఉండాలి. రవాణా వాహనాలు నడిపే వారికి అంతకుముందు లైట్‌ వెయిట్‌ మోటారు వాహన లైసెన్స్‌ పొంది కనీసం ఏడాది గడిచి ఉండాలనే నిబంధన ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments