Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను తిట్టాలని ఉంటే తిట్టండి... నేను పక్కనుంటాను... (Video)

హైదరాబాద్, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్‌కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేపై సినీ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. రాంరెడ్డి అనే వ్యక్తి ఇన

Advertiesment
నన్ను తిట్టాలని ఉంటే తిట్టండి... నేను పక్కనుంటాను...  (Video)
, సోమవారం, 9 అక్టోబరు 2017 (12:17 IST)
హైదరాబాద్, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్‌కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేపై సినీ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవా కారును రాజశేఖర్ కారు ఢీకొట్టింది. ఆసమయంలో కారును రాజశేఖర్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన రాంరెడ్డి తాగి ఉన్నందువల్లే రాజశేఖర్ తన కారును ఢీ కొట్టాడని ఆరోపిస్తూ మండిపడ్డారు. 
 
దీంతో కల్పించుకున్న రాజశేఖర్.. 'మీరు నన్ను తిట్టాలని నిర్ణయించుకుంటే తిట్టండి... పక్కనే నిల్చుంటాను' అంటూ పక్కకెళ్లారు. దీంతో అంతవరకు కోపం వ్యక్తం చేసిన బాధితుడు కూడా నవ్వేశారు. ఇంతలో 'నేను తాగలేదు, ఒత్తిడిలో ఉండటంతో అలా జరిగిపోయింది. అంతే తప్ప చేయాలని చేసింది కాదు' అంటూ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. 
 
అయినా రాంరెడ్డి శాంతించలేదు.. 'సినీ హీరో రాజశేఖర్‌గా మీపై నాకు గౌరవముంది. కానీ ఇలా వేరే ఎవరినో గుద్దేస్తే, వారికి ఏదైనా జరిగితే బాధ్యత ఏంటి? మీరు శిక్షార్హులా? కాదా?' అంటూ నిలదీశారు. ఆయన మాటలతో ఏకీభవించిన రాజశేఖర్ 'నిజమే.. మీకు ఏది న్యాయమనిపిస్తే అది చేయండి, నేను అడ్డుపడను' అంటూ హుందాగా ప్రవర్తించారు. దీంతో సమస్య పరిష్కారమవడానికి మార్గం సుగమమైంది. 
 
ఆ తర్వాత యజమాని ఫిర్యాదు మేరకు.. హీరో రాజశేఖర్‌కు పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ పరీక్షలో మద్యం సేవించలేదని తేలింది. తల్లి చనిపోయిన డ్రిపెషన్‌లో ఉండి కారు నడిపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు రాజశేఖర్ వివరణ ఇచ్చారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సారీ ఆ ఒక్కటే ఉ.కొరియాపై బాగా పనిచేస్తుంది: యుద్ధం ఖాయమన్న ట్రంప్