Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: సినీహీరో రవితేజ సోదరుడి దుర్మరణం

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కోత్వాల్‌గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్‌రాజు మృతి చెందాడు

Advertiesment
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: సినీహీరో రవితేజ సోదరుడి దుర్మరణం
, ఆదివారం, 25 జూన్ 2017 (11:04 IST)
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కోత్వాల్‌గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్‌రాజు మృతి చెందాడు. 
 
శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదవార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి రవితేజ సోదరుడు భరత్‌గా నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరబూసిన కురులు... పింక్ షేడ్ గ్లాసెస్‌తో అదరగొట్టిన జాహ్నవి...