చిట్టి డబ్బులు అడిగినందుకు ఇంత దారుణం చేస్తారా?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:42 IST)
చిట్టి డబ్బులు అడిగినందుకు ఓ దంపతులపై దాడికి పాల్పడ్డారు ఓ చిట్ ఫండ్ ఏజెంట్.. అతని భార్య. హన్మకొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ దంపతులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన పిట్టల రాజు కుమార్‌పల్లిలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. 
 
హంటర్‌రోడ్డుకు చెందిన గణేశ్ అనే ఏజెంట్ ద్వారా ఓ చిట్ ఫండ్ సంస్థలో ప్రతీ నెలా డబ్బులు కడుతున్నాడు. నాలుగు నెలల క్రితం డబ్బులు అవసరమై చిట్టీ పాడుకున్నాడు. అయితే చిట్టీ పాడి 7 నెలలు గడిచినా... అతనికి రావాల్సిన డబ్బులు రాలేదు.
 
ఈ నేపథ్యంలో పిట్టల రాజు.. గణేశ్ ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన గణేశ్ భార్య కావ్య... వెంట తెచ్చిన పెట్రోల్‌ను గణేశ్ సెల్‌ఫోన్ షాపుపై చల్లి నిప్పంటించింది.
 
కావ్య చేసిన పనికి షాక్ తిన్న రాజు దంపతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే కావ్య వారిపై కూడా పెట్రోల్ చల్లి నిప్పంటించింది. ఆపై గణేశ్,కావ్య అక్కడినుంచి పరారయ్యారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపడగా... అతని భార్య తప్పించుకోగలిగింది. స్థానికులు రాజును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments