Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 నెలలుగా సహజీవనం... గర్భిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Advertiesment
8 నెలలుగా సహజీవనం... గర్భిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (07:13 IST)
ఎనిమిది నెలలుగా సహజీవనం చేసి గర్భవతిని చేసిన తన ప్రియురాలిపై ఓ ప్రియుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. వారిద్దరి మధ్య జరిగిన గొడవల కారణంగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ గర్భిణి ప్రస్తుతం ఢిల్లీ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానా రాష్ట్రంలోని సోనీపట్‌ జిల్లాకు చెందిన ప్రగతి, రాహుల్ అనే ఇద్దరు యువతీయువకులు కుండ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూవస్తున్నారు. 
 
ప్రగతి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాహుల్.. తన ప్రియురాలు ప్రగతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రగతి చావుబతుకుల మధ్య ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్ఘనిస్తాన్‌లో గుప్త నిధులు-తాలిబన్లు ఆ సంపదను దోచుకుంటారా ?