Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్ : నాకే డబ్బులు ఇవ్వాలంటున్న రాధికా రెడ్డి

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:11 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన శిల్పాచౌదరి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో కిట్టీ పార్టీల కోసం దివానోస్ పేరుతో ఓ క్లబ్‌ను ఏర్పాటు చేసినట్టు తేలింది. ఇందులో సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సభ్యులుగా చేరారు. ఈ క్లబ్‌లో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నట్టు సమాచారం. ఈ కిట్టీ పార్టీలకు వచ్చిన వారికి అధిక వడ్డీ ఎరవేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తేలింది. 
 
అంతేకాకుండా, శిల్పా చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు తమ కష్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో రాధికా రెడ్డి అనే మహిళతో పాటు మరో మహిళ పేరును ఆమెను వెల్లడించారు. దీంతో రాధికా రెడ్డి హైదరాబాద్ నగర పోలీసులకు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా చౌదరే తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. 
 
తాజాగా జరిపిన విచాణలో షామీర్ పేటకు చెందిన చంద్ర మల్లా రెడ్డి, ప్రతాప్ రెడ్డి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అసలు శిల్పా చౌదరి ఎంత మందిని ఈ విధంగా మోసం చేసిందన్న విషయంపై ఆరా తీసేందుకు పోలీసులు మరోమారు కష్టలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, శిల్పాచౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తొలుత కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ వచ్చిన ఆమె.. ఆ పార్టీలకు వచ్చే అనేక మంది సినీ సెలబ్రీటలకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకున్నారు. 
 
కానీ, వారికి వడ్డీ చెల్లించలేదు కదా అసలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దివ్యారెడ్డి అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో హీరో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments