Webdunia - Bharat's app for daily news and videos

Install App

Agnipath Live: అర్థం చేసుకోండి, అపోహలొద్దు, 10% రిజర్వేషన్లు కల్పిస్తాం: కేంద్రం కీలక నిర్ణయం

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (10:46 IST)
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళన పెల్లుబుకడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అగ్నిపథ్ పథకాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. ఈ రెండింటిలో చేరేందుకు అవసరమైన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.
 
రాకేష్ మృతదేహంతో ర్యాలీకి ప్లాన్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మకంగా మారింది. నిరసనకారులు విధ్వంసానికి దిగగా.. రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఫైరింగ్‌లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ ఆందోళన, కాల్పుల ఘటనకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. కాల్పుల్లో చనిపోయిన రాకేష్ ది వరంగల్ జిల్లా. దీంతో వరంగల్ జిల్లాలో భారీ నిరసనలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. 
 
ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్జి పిలుపునిచ్చారు. ఇక రాకేష్ డెడ్ బాడీతో నర్యంపేటలో భారీ ర్యాలీ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. వరంగల్ ఎంజీఎం నుంచి నర్సంపేట మీదుగా రాకేష్ స్వగ్రామం దబీల్ పురా వరకు ర్యాలీ తీయడానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.
 
సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నర్సంపేట బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది పిలుపిచ్చారని తెలుస్తోంది. అధికార పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉదయాన్నే ఎంజీఎంకు వచ్చి రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించారు. రాకేష్ మృతిపై విచారం వ్యకం చేసిన కేసీఆర్.. 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మోడీ దుర్మార్గ విధానాలకు రాకేష్ బలయ్యాడని కేసీఆర్ ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments