Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మొగుడు మామూలోడు కాదురా బుజ్జీ....

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:36 IST)
ఆదిలాబాద్ జిల్లాలో తన భార్యకు రెండో పెళ్లి చేస్తున్నారంటూ కొమురంభీం జిల్లాకు చెందిన సంజీవ్ అనే యువకుడు పెళ్లి మండపానికెళ్లి పీటలు మీద పెళ్లి ఆపిన సంగతి తెలిసిందే. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్న ఫోటోలు, అక్కడ జారీ చేసిన పెళ్లి సర్టిఫికెట్‌తో కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సంజీవ్ భార్యను వెతికి పెట్టాలని సర్చ్ వారెంట్ కూడా జారీచేసింది. 
 
దీంతో పోలీసులను వెంటపెట్టుకుని జరుగుతున్న పెళ్లిన ఆపాడు. అయితే సంజీవ్ తన భార్యను అత్తమామలు ఎక్కడో బలవంతంగా దాచిపెట్టారని, తన భార్య ఎక్కడుందో వెతికి పెట్టాలని మరోసారి కోర్టుకు తెలపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తీవ్రంగా గాలించి సంజీవ్ భార్యను వెతికి మేడ్చల్ కోర్టులో ప్రవేశ పెట్టారు. 
 
తనకు సంజీవ్‌కు గతంతో ఆర్యసమాజంలో వివాహం జరిగిందని.. అయినా తన తల్లిదండ్రులు మరో వివాహం జరపడానికి నిశ్చయించారని సదరు యువతి తెలపడంతో ఆమెను భర్త సంజీవ్‌కు అప్పగించారు పోలీసులు. దీంతో కోర్టు ఆవరణలోనే దండలు మార్చుకుని సంబురాలు చేసుకున్నారు సదరు జంట. ఈ సందర్బంగా సంజీవ్ పోరాటం ఫలించిందని పలువురు అభినందనలు తెలపడం విశేషం.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments