Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్యకు రెండో పెళ్లి చేస్తారా? ఎంత దమ్ము? పీటలు మీద ఆగిన పెళ్లి

Advertiesment
Second marriage
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (19:56 IST)
పెళ్లికి బంధువుల అందరూ వచ్చారు.. బంతి భోజనాలు జరుగుతున్నాయి. సంప్రదాయాలు ప్రకారం పెళ్లి తంతు, అలంకరణలతో పెళ్లి పందిరి సిద్ధం చేశారు. పెళ్లి మండపం అంతా హడావిడిగా ఉంది. పెళ్లి కూతురును పీటలు మీద కూర్చోబెట్టి జీలకర్ర బెల్లం పెట్టడమే ఆలస్యం. అంతలోనే పెళ్లికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. సినీఫక్కీలో ఓ యువకుడు తన భార్యకు రెండో పెళ్లి  చేస్తున్నారా? ఆపండి అంటూ పెళ్లి వేదికపైకి ఎక్కి గొడవ చేశాడు. 
 
సెర్చ్ వారెంట్‌తో పోలీసులను వెంటబెట్టుకుని మండపానికి రావడంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ సీన్ అంతా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్ పెళ్లి మండపంలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే కొమురంభీం జిల్లాకు చెందిన సంజీవ్ అనే యువకుడు, మాధురి( పెళ్లి కూతురు) తనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, మార్చి 04, 2018న ఆర్యసమాజంలో తమ వివాహం జరిగిందని, దానికి సంబంధించిన ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్‌తో కోర్టును ఆశ్రయించాడు. 
 
తన భార్యకు రెండో వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారనీ, నా భార్యను నాకు అప్పగించాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు సంజీవ్ భార్యను వెతికి పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సంజీవ్ సెర్చ్ వారెంట్‌తో పోలీసులు, న్యాయవాదితో వివాహం జరిగే పెళ్లి మండపానికి చేరుకుని పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేశాడు.

దీంతో అక్కడున్న కొంతమంది యువకులు సంజీవ్ పైన దాడి చేసి పలు వాహనాలు ధ్వంసం చేశారు. తన భార్యకు రెండో పెళ్లి ఎలా చేస్తారని ఆపమంటే దాడికి దిగుతున్నారని ఇదెక్కడి న్యాయమంటూ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీరు తాగితే చల్లదనం వస్తుందా? ఎండలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?