Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. పరిహారంగా ఎకరం భూమి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (15:53 IST)
దేశంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు ఆగడం లేదు. పసి పిల్లల నుండి వయసు మళ్ళిన వృద్ధులపై వరకు మృగాళ్ల పైశాచికంలో మార్పు రావడం లేదు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో బాలికపై ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలికపై ఓ మృగం అత్యాచారం చేయగా పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు.
 
అయితే.. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి విలువ కట్టడం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా సమీపంలోనే నివాసముండే 35 ఏళ్ల ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
 
ఇంటి బయటే ఆడుకుంటున్న బాలిక కనిపించకపోవడంతో వెతికిన బాలిక తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని తెలుసుకొని నిందితుని పట్టుకున్నారు. విషయం గ్రామంలోని పంచాయితీ పెద్దలకు తెలియడంతో పంచాయితీ నిర్వహించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. 
 
జరిగిన అత్యాచారానికి పరిహారంగా భాదితురాలి కుటుంబానికి ఎకరం భూమి ఇప్పిస్తామని తీర్పు చెప్పారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పంచాయతీ పెద్దల తీర్పుకు ఒప్పుకొని తల్లిదండ్రులు స్థానిక ఆలంపూర్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments