Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం పొడగింపు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (15:42 IST)
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కర్ఫ్యూను మరో వారంరోజుల పాటు పొడగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఏప్రిల్ 20వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కొత్త కేసులు వెల్లువలా వస్తుండడంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది.
 
మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 7,646 పాజిటివ్ కేసులు రాగా, 53 మంది మృత్యువాత పడ్డారు.
 
తెలంగాణలో క‌రోనా కేసుల  విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. బుధవారం రాత్రి 8 గంట‌ల నుంచి గురువారం రాత్రి 8 గంటల మ‌ధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 5,926 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,55,618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,261గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,441 మందికి క‌రోనా సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments