ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలోకి తెరాస కీలక నేతలు?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (15:03 IST)
ఇటీవల దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార తెరాస చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ విజయభేరీ మోగించింది. దీంతో పలువురు తెరాస నేతలు బీజేపీలోకి క్యూకట్టారు. 
 
ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన ఆశావహులు టెన్షన్‌లో ఉన్నారు. టికెట్ రాకపోతే వేరే పార్టీలోకి జంప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 10 మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ పది మంది తనతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
 
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి పట్ల వారంతా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి కూడా టీఆర్ఎస్ భయపడుతోందని అన్నారు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత... బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాలను గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీలో చేరబోతున్న 10 మంది టీఆర్ఎస్ నేతలు ఎవరో మాత్రం ఆయన వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments