దుబ్బాక ఎన్నికలు. ఇది తెలంగాణాలో కాదు ఆంధ్రప్రదేశ్ లోను చర్చకు దారితీసిన ఎన్నికలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన జనం ఆసక్తిగా ఈ ఎన్నికలపై చర్చించుకున్నారు. బిజెపి ఒకే ఒక్క సీటుతో తెలంగాణాలో పాగా వేయడం చరిత్రగా మిగిలిపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
అంతేకాదు ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గురించి చర్చ మామూలుగా జరగలేదు. జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎదిగారు రఘునందన్ రావు. ఇదంతా బాగానే ఉన్నా రఘునందన్ రావు మహిళలతో ఆడుకుంటున్నాడంటూ ఒక మహిళ ఒక వీడియోను పోస్ట్ చేయడం ఇప్పుడు బిజెపిలో చర్చకు కారణమవుతోంది.
రోజారమణి అనే మహిళకు రఘనందన్ రావుకు 25 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులకు ధరఖాస్తు చేసుకున్నారు. ఆ కేసు కాస్త 20 సంవత్సరాలుగా కోర్టులో నడుస్తోంది.
కానీ రోజారమణి మాత్రం రఘునందన్ రావు తనను బాగా వాడుకుని వదిలేశాడంటూ ఏకంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ ఆ వీడియో మాత్రం వైరల్‌గా మారుతోంది.
ఎమ్మెల్యేగా రఘునందన్ గెలవడంతో టిఆర్ఎస్ పార్టీ వారే ఆమె దగ్గర ఒక వీడియోను బలవంతంగా చేయించి ఉంటారని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎప్పుడో 20 యేళ్ళ కేసును కావాలనే టిఆర్ఎస్ నాయకులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారని.. ఈ ప్రచారాన్ని నమ్మవద్దంటున్నారు. మరి నిజం ఏమిటో తేలాల్సి వుంది.