Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గ్రేటర్ పీఠం ఆమెకే' : నామినేషన్ - పోలింగ్ - రిజల్ట్స్ వివరాలు ఇలా...

'గ్రేటర్ పీఠం ఆమెకే' : నామినేషన్ - పోలింగ్ - రిజల్ట్స్ వివరాలు ఇలా...
, మంగళవారం, 17 నవంబరు 2020 (14:25 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ పార్థసారథి విడుదల చేయనున్నారు. ఆ తర్వాత బుధవారం నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని.. ఎలక్ట్రానిక్ (ఈ-ఓటింగ్) అవకాశం లేదని కమిషనర్ పార్థసారథి స్పష్టంచేశారు. అదేసమయంలో ఈ దఫా మేయర్ పీఠం రొటేషన్ పద్ధతిలో జనరల్ కేటగిరీలో మహిళలకు కేటాయించడం జరుగుతుందన్నారు. 
 
డిసెంబరు 1న పోలింగ్... 4న ఫలితాల వెల్లడి 
ఇకపోతే, 'డిసెంబరు ఒకటో తేదీన ఉదయం 7నుంచి సాయంత్రం 6గంలకు వరకు పోలింగ్ జరుగుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రత్యేక గుర్తులు కేటాయిస్తాం. డిసెంబరు 04న మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వెల్లడిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి. జనరల్ అభ్యర్థులకు రూ. 5వేలు డిపాజిట్ చెల్లించాలి. 
 
ఆన్‌లైన్‌లో నామినేషన్ ఫా‌మ్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈనెల 13న ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను విడుదల చేశాం. వార్డుల డీలిమిటేషన్, రిజర్వేషన్లు ప్రక్రియ ప్రభుత్వ స్థాయలో జరిగింది. మేయర్ స్థానం‌ జనరల్ మహిళ కేటాయించడం జరిగింది. ఈఏడాది జనవరి 20 నాటికి 18 ఏళ్ళు పూర్తిచేసుకున్న వారు ఓటును వినియోగించుకోవచ్చు. పోలీంగ్ స్టేషన్ల ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు’ అని పార్థసారధి తెలిపారు.
 
గ్రేటర్‌లో ఎంత మంది ఉన్నారు..?
‘గ్రేటర్‌లో మొత్తం ఓటర్స్ 74,04,286 మంది ఉన్నారు. అందులో పురుషులు 38,56,770 మంది, మహిళలు 35,46,847 మంది ఉన్నారు. ఇతరులు 669 మంది ఉన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 9,248 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. 150 డివిజన్లలోనూ బ్యాలెట్ పద్ధతినే పోలింగ్ జరుగుతుంది.

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజింగ్ యాప్ ద్వారా ఓటర్లను గుర్తిస్తాం. గ్రేటర్‌లో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి. ఈ డివిజన్లో మొత్తం 79,290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27,948 మంది ఓటర్లు ఉన్నట్టు కమిషనర్ వివరించారు. 
 
ఇకపోతే, ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.5 లక్షలు మాత్రమే. 45 రోజుల లోపు అభ్యర్థి ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించాలి. తప్పుడు వివరాలు సమర్పిస్తే అభ్యర్థిని మూడేళ్ళపాటు అనర్హుడిగా ప్రకటించే హక్కు ఎస్ఈసీకి ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉంది. చట్ట ప్రకారమే ఎన్నికల నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేశాం. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. 
 
కాగా, ఎన్నికల సమయంలో 150 డివిజన్లకు 150 మంది ఆర్వోలు, 150 కౌంటింగ్ సెంటర్లు ఉంటాయి. నవంబర్ 21 పోలింగ్ కేంద్రాలు ప్రకటిస్తాం. ప్రతి పోలింగ్ కేంద్రంలో నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారు. 532 ప్రాంతాల్లో 2,700 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 

కాగా, నామినేషన్, పోలింగ్, ఫలితాలను పరిశీలిస్తే, 
* నవంబర్-18 నుంచి నామినేషన్ల స్వీకరణ
* నవంబర్- 20న నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు
* నవంబర్- 21న నామినేషన్ల పరిశీలన
* నవంబర్- 24న నామినేషన్ల ఉపసంహరణ
* డిసెంబర్- 01న పోలింగ్
* డిసెంబర్-03న అవసరమైతే రీపోలింగ్
* డిసెంబర్-04న ఓట్ల లెక్కింపు.. అదే రోజున ఫలితాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ రమ్మీ: ఈ యాప్‌లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి