ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (15:55 IST)
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో 108 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.
 
సోమవారం నాడు పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచీ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ భారీ పేలుడు కారణంగా రియాక్టర్ పరిధిలోని భవనం కూలిపోగా మరో భవనం బీటలు బారింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ మృతి చెందారు.
 
పేలుడు జరిగిన సమయంలో ఆయన కారులో వచ్చారు. ఆయన అలా వచ్చి కారు లోపల నుంచి దిగే సమయానికి పేలుడు జరగడంతో ఆయన మృత్యువాత పడ్డారు. ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదం జరగడానికి కారణాలేమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments