Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (11:06 IST)
భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినథ్యం వహిస్తున్న ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 5వ తేదీన గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ  ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. 
 
ఈ నెల 5వ తేదీన గోపీనాథ్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు గుర్తించి, సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి, నాడి, రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు.
 
కాగా, గోపీనాథ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నారు. తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో మళ్లీ మృతి చెందారు. 
 
కాగా, టీడీపీతో 1982లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన... 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నియామక పత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ అందజేయడం గమనార్హం. 
 
ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2018లో అప్పటి తెరాసలో చేరారు. అదే యేడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. 
 
గత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి గెలుపొంది అసెబ్లీలోకి అడుగుపెట్టారు. 2022లో ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడుగా కీలక బాధ్యతలు స్వీకరించారు. గోపీనాథ్ మృతిపెట్టల పలువురు తమ ప్రగాఢ సంపాతాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments