Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబుకు ఊరట ... పోలీసుల నోటీసులపై హైకోర్టు స్టే

ఠాగూర్
బుధవారం, 11 డిశెంబరు 2024 (17:02 IST)
సినీ నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాచకొండ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. అలాగే, పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీన వాయిదా వేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగ మోహన్ బాబుపై నమోదైన కేసులను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు వివరించారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదైనట్టు తెలిపారు. మంగళవారం సాయంత్రం జర్నలిస్టులపై దాడి కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో పోలీసుల నోటీసులు అందుకున్న మంచు మనోజ్ ఈ రోజు విచారణకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు. 
 
మోహన్ బాబు ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు కోరారు. అయితే, నిత్యం గస్తీ ఏర్పాటు చేయడం కదరదని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. అయితే, రెండు గంటలకు ఓ సారి పోలీసులు అక్కడి పరిస్థితులు గమనించి వస్తారన్నారు. దీంతో రెండు గంటలకోసారి పోలీసులు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు పరిస్థితి పర్యవేక్షించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments