Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోహన్ బాబు కుటుంబానికి ఏదో నరఘోర తలిగిలింది : నట్టి కుమార్ (Video)

natti kumar

ఠాగూర్

, బుధవారం, 11 డిశెంబరు 2024 (13:54 IST)
సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీకి ఏదో నర ఘోష తగిలినట్టుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మంచు ఫ్యామిలీ వివాదంపై ఆయన స్పందిస్తూ, చిత్ర పరిశ్రమలో మంచు కుటుంబానికి మంచి పేరుందని, కానీ ఇలాంటి పరిణామాలు దురదృష్టకరమన్నారు. ఇదొక దుమారం తప్ప, మరేమీ కాదని, ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని తెలిపారు.
 
'వచ్చే ఏడాది మోహన్ బాబు కెరీర్ కు 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఎదిగి, విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండస్ట్రీలో ఒక పులి లాంటి వ్యక్తి మోహన్ బాబు. దాసరి నారాయణరావు తర్వాత ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి మోహన్ బాబు మాత్రమే. ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించే నిజం. 
 
ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకుంటారని మంచు కుటుంబానికి మంచి పేరుంది. మనోజ్ కూడా చాలా మంచి వ్యక్తి. విష్ణు, మంచు లక్ష్మి కూడా మంచి వారే. ఇతరులకు సహాయపడడంలో ముందుండే వ్యక్తులు వాళ్లు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు అందరి కుటుంబాల్లో ఉంటాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలనేది ఇతరులు ఆయనకు చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దాసరి నారాయణరావు గారే. ఆయన ఇప్పుడు లేరు. కాబట్టి, ఆయన కుటుంబంలో సమస్యను పరిష్కరించే శక్తి ఇంకెవరికీ లేదు. తన కుటుంబంలో వివాదాన్ని ఒక్క మోహన్ బాబు మాత్రమే పరిష్కరించుకోగలరు.
 
మంచు మనోజ్‌కు, విష్ణుకు, లక్ష్మికి చెబుతున్నాను... మీ నాన్నగారు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని సినీ ప్రముఖులతో పాటు మీరందరూ కూడా దగ్గరుండి జరిపించాలి. ఇలాంటి చిన్న చిన్న వివాదాలకు స్వస్తి పలికి... 50 ఏళ్లుగా ఎంతో క్రమశిక్షణతో మెలిగి ఆయన
 
సంపాదించుకున్న పేరును మీరు నిలబెట్టాలి. అందరి తరపు నుంచి మోహన్ బాబు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను... ఈ గొడవకు ఇంతటితో స్వస్తి పలకాలి అని నట్టి కుమార్ విజ్ఞప్తి చశారు. 




Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun latest update: పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం తాజా అప్ డేట్