Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాలో మారిపోయిన వాతావరణం

ఠాగూర్
బుధవారం, 11 డిశెంబరు 2024 (16:50 IST)
అగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నెలకొంది. ఈ కారణంగా 24 గంటల్లో శ్రీలంక - తమిళనాడు తీరాల దిశగా పయనిస్తుంది. ఈ కారణంగా బుధవారం, గురువారం రోజుల్లో ఏపీ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ - నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుందని, ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి శ్రీలంక - తమిళనాడు తీరాల దిశగా వస్తుందని పేర్కొంది. 
 
దీని ప్రభావంతో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఈ నెల 11, 12వ తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బంగాళాఖాతంలోకి జాలర్లు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తాలో జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైవుంది. చాలా ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. దాంతో చలి పెరిగింది. 
 
మరింత బలపడిన అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో వర్షాలు 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. నైరుతి బంగాలాఖాతాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ మధ్య వాయవ్య దిశగా పయనిస్తూ శ్రీలంక - తమిళనాడు తీరాలకు చేరువగా వస్తుందని వివరించింది. 
 
ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 11వ తేదీ బుధవారం నాడు నెల్లూరు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈ నెల 12వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments