Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంక కొత్త ప్రధానిగా అమరసూర్య ... ప్రమాణం చేయించిన అధ్యక్షుడు

harini amarasuriya

ఠాగూర్

, బుధవారం, 25 సెప్టెంబరు 2024 (10:59 IST)
శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా హరిణి అమరసూరియ ఎన్నికయ్యారు. ఆమెతో లంక అధ్యక్షుడు దిసనాయకే ప్రమాణ స్వీకారం చేశారు. నషనల్ పీపుల్స్ పవర్‌కు చెందిన 54 యేళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అమర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరిని కేబినెట్ మంత్రులుగా నియమించారు. 
 
సిరిమావో బండారు నాయకే తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి అమరసూర్య కావడం గమనార్హం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేశ్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేశారు. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా చరిత్రను సృష్టించారు. సిరిమావో బండారునాయకే, చంద్రికా కుమారతుంగ తర్వాత మరో మహిళ శ్రీలంక ప్రధాని పీఠం అధిష్ఠించడం ఇదే ప్రథమం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్