Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో ప్రమాదకరమైన క్లేడ్ 1బి రకం మంకీపాక్స్ గుర్తింపు!

monkeypox

ఠాగూర్

, బుధవారం, 25 సెప్టెంబరు 2024 (09:33 IST)
దేశంలో మరో ప్రమాదకరమైన మంకీపాక్స్ వైరస్ వెలుగు చూసింది. ఇటీవలే యూఏఈ నుంచి వచ్చి ఓ వ్యక్తిలో ఈ వైరస్ కనిపించింది. కేరళ రాష్ట్రంలోని మలప్పురంకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల యూఏఈ నుంచి తిరిగి వచ్చాడు. అతిని విమానాశ్రయంలో వైద్య పరీక్షలు చేయగా, అతనిలో మంకీపాక్స్ క్లేడ్ 1బి వైరస్ ఉన్నట్టు గుర్తించరు. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
 
ఈ రకం స్టెయిన్‌కు సంబంధించి దేశంలో నమోదైన తొలి కేసు ఇదేనని వైద్యులు తెలిపారు. 38 యేళ్ల బాధితుడిలో వారం రోజుల క్రితమే వైరస్‌ను నిర్ధారించారు. తాజాగా అతడికి మంకీపాక్స్ క్లేడ్ 1బి వైరస్ సోకినట్టు తెలిపారు. కాగా, ఈ నెల 9వ తేదీన నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తిలో క్లేడ్-2 రకం వైరస్‌ను గుర్తించిన విషయం తెల్సిందే. ఈ తరహా వైరస్ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో అధికంగా కనపిస్తుంది. కాగా, ఈ వైరస్‌పై మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ బాలికపై వేధింపులు.. ప్రైవేట్ వీడియోను క్యాప్చర్ చేసి...?