ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని వారాల క్రితం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలో ఈ రెండో మంకీ పాక్స్ కేసు నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితుడికి మంకీపాక్స్‌కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్లు వెల్లడింది.
రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన కేరళ వాసి అని విచారణలో వెల్లడి అయ్యింది. ఇకపోతే.. విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య మంత్రి చెప్పారు.
అంతకుముందు విదేశాలకు వెళ్లి భారతదేశానికి తిరిగి వచ్చిన డిల్లీకి చెందిన వ్యక్తికీ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు వెల్లడింది. ఇలా మొదటి కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదైంది. రెండో కేసు కేరళలో నమోదైంది.