Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024’తో చెన్నైలో నైట్ స్ట్రీట్ రేస్‌ను నిర్వహించిన మొబిల్

Advertiesment
Night Street Race

ఐవీఆర్

, ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (22:06 IST)
ఆగస్ట్‌ 31 మరియు సెప్టెంబరు 1న చెన్నై ఫార్ములా రేసింగ్ సర్క్యూట్‌లో జరిగిన 'ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024' సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి నైట్ స్ట్రీట్ రేస్ నిర్వహించటం కోసం ఆటోమోటివ్ లూబ్రికెంట్‌లలో అగ్రగామి సంస్థ, మొబిల్, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPPL)తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ మైలురాయి కార్యక్రమం, ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌తో మొబిల్ యొక్క మూడవ సంవత్సర అనుబంధాన్ని సూచిస్తుంది, ఇది వేగం, నైపుణ్యం, సాంకేతికత మరియు పనితీరు యొక్క అద్భుతమైన కలయికను ప్రదర్శిస్తుంది.
 
ఇండియన్ రేసింగ్ లీగ్ మరియు ఫార్ములా 4 ఛాంపియన్‌షిప్ రెండింటికీ అధికారిక లూబ్రికెంట్ భాగస్వామిగా, మొబిల్, తమ 'పెరఫార్మెన్స్ బై మొబిల్ 1' కు అనుగుణంగా భారతీయ మోటర్‌స్పోర్ట్‌లను అభివృద్ధి చేయడంలో దాని నిబద్ధతను నొక్కిచెప్పింది,  RPPL నిర్వహించే ఈ ఉత్సవం నవంబర్ 2024 వరకు దేశవ్యాప్తంగా ఐదు ఉత్తేజకరమైన రౌండ్‌లను కలిగి ఉంది. ఈ ఈవెంట్ భారతదేశంలో మొబిల్1 యొక్క 50 సంవత్సరాల కార్యకలాపాలను కూడా వేడుక జరుపుకుంది.
 
ఈ సందర్భంగా ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీఈఓ-శ్రీ విపిన్ రాణా మాట్లాడుతూ, “ఇండియా రేసింగ్ వీక్‌లో భాగం కావటం ఒక గౌరవంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం గ్లోబల్ మోటర్‌స్పోర్ట్‌లను అభివృద్ధి చేయడంలో మా అంకితభావాన్ని ప్రదర్శించడమే కాకుండా భారతదేశంలో రేసింగ్ భవిష్యత్తును వేగవంతం చేస్తుంది" అని అన్నారు. 
 
RPPL చైర్మన్ శ్రీ అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ, మొబిల్‌తో ఈ భాగస్వామ్యం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. భారతదేశం యొక్క మొదటి నైట్ స్ట్రీట్ రేస్‌కు జీవం పోసినందుకు థ్రిల్‌గా ఉన్నాము. ఎఫ్ 4, ఐఆర్ఎల్ యొక్క అన్ని జట్లకు అభినందనలు, మేము భవిష్యత్తులో కూడా అదే జోరును కొనసాగించాలని ఎదురుచూస్తున్నాము" అని అన్నారు. 
 
బాలీవుడ్ స్టార్లు జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ మరియు నటుడు నాగ చైతన్య వంటి ప్రముఖ టీమ్ యజమానులు కారణంగా ఈ ఫెస్టివల్ గణనీయమైన రీతిలో ప్రజలను ఆకర్షించింది. ఈ కార్యక్రమం గ్రాండ్ అవార్డు వేడుకతో ముగిసింది, విజేత జట్లు మరియు వ్యక్తుల యొక్క అసాధారణ ప్రదర్శనలను వేడుక జరుపుకుంది, భారతదేశంలో మోటర్‌స్పోర్ట్ యొక్క భవిష్యత్తును నడిపించడంలో మొబిల్ 1 పాత్రను మరింత సుస్థిరం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్ఐసి ఎంఎఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్‌ను విడుదల చేసిన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్