తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (15:43 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రవర్గాన్ని విస్తరించారు. కొత్తగా ముగ్గురికి చోటు కల్పించారు. వీరిలో గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ఉన్నారు. వీరంతా ఆదివారం కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో వీరితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. 
 
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీవరిలు ఉన్నారు. 
 
తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. కాగా, ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలన్న అధిష్టానం సూచనతో ముఖ్యమంత్రి ఆ మూడు సామాజిక వర్గాలకు మాత్రమే అవకాశం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments