కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (13:52 IST)
బెంగుళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారు. వీరిలో హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) కూడా ఉన్నారు. ఇంటిలో చెప్పాపెట్టకుండా ఈ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఊరేగింపు కోసం వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్.. మృతితో అతని తల్లి తల్లడిల్లోపోతున్నారు. 
 
వంద కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు సమాధి వద్ద తండ్రి బోరుమంటున్న వీడియోను చూసిన ప్రతి ఒక్కరినీ కలసివేస్తోంది. హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగుళూరులో ఉంటూ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు. 
 
కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లిన తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువరం పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత భూమిక్ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తి చేశాడు. 
 
అయితే తన బిడ్డ మృతిని జీర్ణించుకోలేక ఆ తండ్రి పడుతున్న వేదన అంతఇంతా కాదు. కొడుకును పాతిపెట్టిన సమాధిపై పడి రోదిస్తున్నాడు. కొడుకా.. లేవరా... రూ.100 కోట్ ఆస్తి రాసిపెట్టాను.. అంటూ విలపించడం ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తుంది. 



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments