దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (08:42 IST)
తెలంగాణ, హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ సీనియర్ నేత రాజసింగ్ పార్టీ పెద్దలకు ఓ బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. పైగా, సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బహిర్గతం చేస్తానంటూ హెచ్చరించారు. తనకు నోటీసులు పంపాలన్న ఆలోచనే ఏమాత్రం భావ్యం కాదని, పైగా, ఎవరి వల్ల పార్టీకి నష్టమో ప్రజల ముందు ఉంచుతానని ఆయన వెల్లడించారు. 
 
తనకు పార్టీ నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. ధైర్యముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే పార్టీలోని కొందరు అసలు స్వరూపాలను బయటపెడతానని, అందరి జాతకాలు ప్రజలు ముందు ఉంచుతానని హెచ్చరించారు. 
 
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, నాయకత్వానికి  దూరంగా ఉంటున్నారనే ఆరోపణలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణాలతో రాజాసింగ్‌‍కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన పై విధంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments