Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకల్లో విషాదం.. కారు నడిపిన వరడు : ఓ మహిళ మృతి

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (11:11 IST)
మరికొన్ని క్షణాల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు చేసిన పనికి ఓ మహిళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఫోన్ మాట్లాడేందుకు డ్రైవర్ కారును ఆపగా, ఆ కారులోనే ఉన్న వరుడు.. స్టీరింగ్ అందుకుని కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో గురువారం రాత్రి మెట్‌‍పల్లికి చెందిన బకారపు ప్రభాకర్ కుమార్తె నవ్య. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జనుక అశోక్‌ల వివాహం గురువారం జరిగింది. 
 
పెళ్లి వేడుకలో భాగంగా, బారత్ నిర్వహించారు. వధూవులతో పాటు ఆరుగురు కారులో కూర్చొన్నారు. ఈ కారు ప్రభాకర్ ఇంటి నుంచి బయలుదేరింది. అదేసమయంలో డ్రైవర్‌కు ఫోన్ రావడంతో మాట్లాడేందుకు కారు ఆపి కిందికి దిగాడు. దీంతో పెళ్లి కుమారుడు స్టీరింగ్ అందుకున్నాడు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే క్రమంలో కారు అదుపు తప్పి వేగం పుంజుకుని ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమలో రోడ్డు పక్కన నిల్చొని బరాత్‌ను తిలకిస్తున్న వారిని బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో బకారపు ఉమ (35), ఆమె కు మార్తె నిఖితతో పాటు పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమను తొలుత హుజారాబాద్ ఆస్పత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments