Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి.. ఆ కొద్దిసేపటికే...

Advertiesment
father kanyadanam

ఠాగూర్

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. తన కుమార్తె పెళ్లిలో ఓ తండ్రి మృత్యువాతపడ్డారు. కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన కొన్ని క్షణాలకే పెళ్లిమండపంలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం, రామేశ్వరపల్లి గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన బాలచంద్రం (56) వృత్తి రీత్యా కామారెడ్డిలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య రాజమణి, ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె కనకమహాలక్ష్మి వివాహం బెంగుళూరుకు చెందిన రాంఘవేంద్రతో ఇటీవల నిశ్చయించారు. 
 
ఈ క్రమంలో జంగంపల్లి శివారులోని బీటీఎస్ వద్ద ఓ కళ్యాణ మండపంలో శుక్రవారం పెద్దకుమార్తె వివాహ ఏర్పాట్లు వైభవంగా చశారు. అయితే, కన్యాదానం చేసిన కొద్దికేపటికే వధువు తండ్రి బాలచంద్ర కళ్యాణ మండపంలో గుండెపోటుతో కుప్పూకిలోపాయాడు. ఈ హఠాత్పరిణామంతో అందరూ నిర్ఘాంతపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆయనను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
పెళ్లి మండపంలోనే వధువు తండ్రి గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో అప్పటివరకూ బాజా భజంత్రీలు, బంధుమిత్రులతో కళకళలాడిన పెళ్లి మండపంలో విషాద చాయలు అలముకున్నాయి. వధువు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో పెళ్లి మండపం శోకసందమైంది. ఈ ఘటన చూపరుల హృదయాలను కలిచివేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్కుడు : హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు...